పరమ పూజ్య
రాధానాథ్ స్వామి
మహరాజ్

శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క అవసరాలను అర్థం చేసుకోవడమే నిజమైన కరుణ.


రాధానాథ్ స్వామి 1950లో రీఛార్జ్ స్లావిన్ గా చికాగో లో జన్మించారు. యుక్త వయస్సులోనే ప్రారంభించిన తన ఆధ్యాత్మిక అన్వేషణ తనను యూరోప్, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల గుండా ప్రయాణింపచేసి చివరకు భారతదేశానికి తీసుకొచ్చింది. భారతదేశంలో వారు తన గురువైన శ్రీల ప్రభుపాదుల వారిని కలిసి గౌడియ వైష్ణవ భక్తి సంప్రదాయానికి పరిచయమయ్యారు. రాధానాథ్ స్వామి ఎన్నో సంవత్సరాలుగా భక్తి యోగ యొక్క బోధనలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందించటానికి తనను తాను అంకితం చేసుకున్నారు. వారు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరించే "అమ్మ ఒడిలోకి పయనం" మరియు ఆత్మాన్వేషణ మార్గంలో ఆచరనాత్మక అవగాహనలను మరియు మార్గదర్శకత్వాన్ని అందించే "అంతరంగ పయనం" వంటి అనేక పుస్తకాలను రచించారు. రాధానాథ్ స్వామి గోవర్ధన్-ఈకో-విలేజ్, రాధాగోపినాథ్ మందిరం వంటి అనేక దాతృత్వ సంస్థలను స్థాపించారు. గోవర్ధన్-ఈకో-విలేజ్ సుస్థిరమైన జీవనం మరియు పర్యావరణ అవగాహనను ప్రోత్సహిస్తుంది. ముంబైలో ఉన్న రాధా గోపీనాథ్ మందిరం వెనకబడిన పిల్లలకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని మరియు చదువుని అందిస్తుంది.

పుస్తకాలు

ఒక అమెరికా స్వామి ఆత్మకథ అనే పుస్తకం రాధానాథ్ స్వామి యొక్క చరిత్ర. ఈ పుస్తకం ద్వారా వారు ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని కోరుకుంటూ ఐరోపా నుండి భారతదేశం వరకు చేసిన తన అసాధారణ ప్రయాణాన్ని పంచుకున్నారు. మరణ సమీప అనుభవాలు, హిమాలయాలలో ధ్యానం చేయడం, మన కాలంలోని అత్యంత ప్రసిద్ధమైన కొందరు గురువుల నుండి జ్ఞానాన్ని వినడం వంటి విషయాలను ఇందులో తెలియజేస్తు రాధానాథ్ స్వామి మిమ్మల్ని తన ఆకర్షణీయమైన జీవిత కథలో నిమగ్నం చేస్తారు.

అమ్మ ఒడిలోకి పయనం

అంతరంగ పయనం

అంతరంగ పయనం: ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు మరియు సామాజిక కార్యకర్త అయిన రాధానాథ్ స్వామి, భక్తి మార్గాన్ని అన్వేషిస్తూ, దశాబ్దాల నుండి భక్తి యోగాన్ని నేర్పిస్తున్న గురువుగా తన అనుభవాలను, సన్నిహిత కథల ద్వారా, పాశ్చాత్య మతాలు మరియు సిద్ధాంతాలను ప్రకాశవంతంగా ప్రస్తావిస్తూ పంచుకున్నారు. అంతరంగ పయనం మనందరినీ ఒకటి చేసే సాధారణ సత్యాలను కనుగొనడానికి ఆహ్వానిస్తోంది.


ప్రాజెక్టులు

భక్తి వేదాంత హాస్పిటల్

అన్నామృత - మధ్యాహ్న భోజనం

గోవర్ధన్-ఈకో-విలేజ్